బడుగు, బలహీన వర్గాల దేవుడు కేసీఆర్.. నిత్యం పేదల గురించే ఆలోచించే హృదయశీలి కేసీఆర్.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవులకు కేసీఆర్ ఒక ఊపిరి.. అలాంటి కేసీఆర్‌పై దీవెనల వర్షం కురుస్తోంది. రాష్ట్ర మహిళా లోకం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అయితే కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నామని చెబుతున్నారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ముందుండి పోరాటం చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నగదు ప్రోత్సాహం అందింది. 47 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 30 కోట్లకు పైగా నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు బాసమ్మ.. తన ఖాతాలో జమ అయిన నగదు ప్రోత్సాహం రూ. 5 వేలను విత్ డ్రా చేసుకున్నారు. నగదు ప్రోత్సాహం అందుకున్న ఆ కార్మికురాలి ముఖం వెలిగిపోయింది. చిరునవ్వు చిందిస్తూ ఆనందం వ్యక్తి చేసిందామె. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సీఎం కేసీఆర్ సార్‌కు పాదాభివందనం చేస్తున్నానని కార్మికురాలు బాసమ్మ పేర్కొంది. పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా ఉండటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని బాసమ్మ అన్నారు.